తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో..రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ,స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సహకారంతో గ్రేటర్ వరంగల్ 48వ డివిజన్ కార్పొరేటర్ గా బోయినపల్లి రంజిత్ రావు ఎన్నికై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను తన డివిజన్ లోని ప్రజలకు చేరవేస్తూ..నియోజకవర్గంలోనే మంచి పేరు సంపాదించుకుంటున్నారు.ఈ క్రమంలోనే రంజిత్ రావు వరంగల్ నగరంలో ఏ కార్పొరేటర్ చేయని విధంగా రంజాన్ పండగ పర్వదినం కానుకగా తన సొంత ఖర్చులతో తన డివిజన్ లోని ముస్లిం సోదరులకు “రంజాన్ కేటీఆర్ కిట్” పేరిట ఒక కిట్ ను పంపిణీ చేశారు.గతేడాది కూడా రంజిత్ రావు ఈ కార్యక్రమాన్ని చేశారు.తాజాగా ఇవాళ మొత్తం ఎనిమిది వస్తువులతో కూడిన కిట్ ను పర్యావరణ పరిరక్షణ కోసం మంత్రి కేటీఆర్ సూచన మేరకు చేనేత బ్యాగ్స్ ద్వారా స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో పంచి స్థానిక ముస్లిం సోదరులతో పాటుగా స్థానిక ప్రజల, నాయకుల నుండి మన్నలను పొందారు.
see also:మంత్రి కేటీఆర్‌కు జర్మనీ సంస్థ ఆహ్వానం..!!
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం దుస్తులను పంపిణీ చేస్తుందన్నారు. ముస్లిం సోదరులందరూ సంతోషంగా రంజాన్‌ను జరుపుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ రంజిత్ రావు పంపిణీ చేస్తున్న రంజాన్ కేటీఆర్ కిట్ కార్యక్రమాన్ని అభినందించారు.అనంతరం డివిజన్ లోని థైరా కుటుంబానికి రంజిత్ రావు పెళ్లి ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలను ఇచ్చి తన గొప్ప మనసును చరుకున్నారు.ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి , డివిజన్ నాయకులు ,ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
see also;మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లీయర్..!!
“రంజాన్ కేటీఆర్ కిట్” లో ఉన్న వస్తువులు..
1) కేజీ చికెన్( కూపన్ ) ,
2) రెండు కేజీల బియ్యం ,
3) ఒక పాల ప్యాకెట్ ,
4) 500 గ్రాముల సేమియా ,
5) 500 మీ.లీ వంట నూనె,
6) 500 300 గ్రాముల పంచదార ,
7) 50 గ్రాముల డ్రై ఫ్రూట్స్ ,
8) 50 గ్రాముల బిర్యానీ వంటకు సంబంధించిన సామాను