Home / SLIDER / వెంకటేశ్వరరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

వెంకటేశ్వరరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఎంతో పోరాడారని, పత్రికా-సాహితీ రంగానికి విశేష సేవలు అందించారని ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

see also:సర్కార్ నిర్ణయం.. పేదల దగ్గరకే రూ.5 భోజనం..!!

ఖమ్మం జిల్లా పండితాపురానికి చెందిన ఆదిరాజు వెంకటేశ్వర్ రావు 1969 ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. అనేక పుస్తకాలు రచించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన క్రియాశీల పాత్రను గుర్తించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు విశిష్ట పురస్కారం అందించింది.

see also:తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక మంత్రి ఫిదా..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat