నందమూరి కుటుంబంలో మరో వారసుడు పుట్టాడు. అచ్చం తాత పోలికలతో సినీరంగ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి అయ్యారు. ఈ సారి కూడా కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. తారక్ ట్వీట్ చేసిన వెంటనే వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ కొడుకు పోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఆ దరువు ఎక్స్ క్లూజివ్ పోటోగా క్రింద చూడవచ్చు. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు.
see also:సంగీత దర్శకుడు ఆత్మహత్య..!