ఈ మధ్య కాలంలో చాలా మందికి పడుకోగానే నిద్ర పట్టదు. నిద్రపట్టేందుకు గంటకు పైగానే సమయం పడుతుందని, సరైన నిద్ర కావడం లేదని బాధ పడుతుంటారు. ఇలా రాత్రికి రైన నిద్ర పట్టకపోవడం వల్ల ఉదయాన్నే లేవాలని అనిపించదు. అలాగే, పనిచేసే సమయంలో కూడా చాలా విసుగ్గా అనిపిస్తుంది. పడుకోగానే నిద్ర పట్టం కూడా చాలా అదృష్టమే. అయితే, పడుకోగానే నిద్ర పట్టకపోవడానికి ముఖ్య కారణాలు అలసట, పని ఒత్తిడి, కండరాలు బిగుసుకుపోవడం, ఇలా కొన్ని కారణాల వల్ల నిద్ర పట్టక నిద్ర లేమితో బాధపడుతుంటారు. అయితే, ఇలా నిత్యం బాధపడుతున్న వారు సింపుల్ టెక్నిక్‌ను పాటించడం వల్ల చిటెకలో నిద్రలో జారుకుంటారని చెబుతున్నారు వ్యాయామ నిపుణులు.
మైండ్‌ఫుల్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ :-
ఈ వ్యాయామాన్ని చేయడం వల్ల ఒకటి, రెండు నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. పడుకోబోయే ముందు ఏదైనా చద్దర్‌ను వేసుకుని దానిపై నిటారుగా కూర్చోవాలి. ఆ తరువాత గాలిని నెమ్మదిగా, ఎంత గాలిని పీల్చుకోగలరో అంత పీల్చుకోవాలి. పీల్చుకున్న ఆ గాలిని ఏడు, ఎనిమిది సెకండ్స్ వరకు అలానే ఆపాలి. తరువాత ఈ గాలిని నోటీ ద్వారా నెమ్మదిగా వదలాలి. ఇలా ఒకటి రెండు నిమిషాలపాటు చేయాలి. ఇలా చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా పడుకోబోయే ముందు చేయడం వల్ల శరీర కండరాలు రిలాక్స్ అవుతాయి. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఈ చిన్న వ్యాయామం చేయడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.