కొమురవెళ్లి మల్లన్న స్వామివారిని శుక్రవారం ఉదయం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు .మన్త్రిఒ వెంట శాసన సభ విప్, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం ఆలయంలోని పాలక మండలి కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు సమక్షంలో జరిపారు. ఈ మేరకు కొముర వెళ్లి దేవాలయ కమిటీ ఛైర్మన్ సంపత్ కు, కమిటీ సభ్యులందరికీ ఎన్నికైనందుకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.
గొల్ల కుర్మల ఆరాధ్య దైవమైన కొముర వెళ్లి మల్లన్న స్వామి ఆలయానికి కమిటీ ఛైర్మన్ గా గొల్ల కుర్మలే ఉండాలన్న కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్ గారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగేళ్లలో మల్లన్న దేవాలయానికి మహర్దశ వచ్చిందన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూ.10కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు తెలుపుతూ.. కమిటీ పై బాధ్యత పెరిగిందని అధికారం వచ్చిందని.. భావించొద్దని.. మీలో సేవా తత్వం పెరగాలని కమిటీ సభ్యులకు మంత్రి సూచనలు చేశారు. భక్తులకు సేవ చేయడమంటే.. భగవంతునికి సేవ చేయడమేనంటూ.. మీ అందరిదీ.. ఒకే మాట.. ఒకే బాటగా సమిష్టిగా కలిసి పని చేయాలని కోరారు. అన్ని వసతులను సమకూర్చేలా.. సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని, ఇక్కడ జరిగే అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు. 4 ఏళ్లలో ఆలయ అభివృద్ధిలో ఎంతో మార్పు జరిగిందని, మరింత అభివృద్ధికి మా సంపూర్ణ సహకారం ఉంటుందని కొత్త పాలక మండలికి మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు.
అంతకు ముందు ఆలయ అభివృద్ధి పై అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. ఆలయ పరిసరాలలో ప్లాస్టిక్ ను నిషేధం చేసేలా కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోవాలని, ఆ విషయంలో ప్రత్యామ్నాయ కల్పనకు కృషి చేసేలా చొరవ చూపాలని పాలక మండలి, అధికారిక యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ఆలయ ప్రత్యేక అధికారి, డీఆర్వో చంద్రశేఖర్ లు ఇరువురు ఆలయ అభివృద్ధి పనులు జాప్యం తీరుపై ఉగ్ర నరసింహ రూపం ఎత్తాలన్నారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల పై క్షుణ్ణంగా సమీక్షిస్తూ.. తిరిగి తాను వచ్చే నెల రోజుల లోపు పనులు తొందరగా చేయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ బుధవారం ఆలయ అభివృద్ధి పై డీఆర్వో చంద్రశేఖర్, ఆలయ ఈఓ, పాలక మండలి సభ్యులతో సమీక్ష జరపాలని మంత్రి సూచనలు చేశారు.