ఎన్నో రోగాలకు చెక్‌పెట్టే మూ డు శ్వాస వ్యాయామాలు. మన శరీరంలో నిర్దిష్టమైన అవయవాలు కలిసి ఒకే ప్రాంతంలో ఉంటాయి. ఉదాహరణకు ఊపిరితిత్తులు, కాలేయం, గుండె వంటివి ఉరఃపంజరంలో ఎముకల కింద ఉంటాయి. తలలో అయితే, మెదడు, నాడీ మండల వ్యవస్థ, బయటకు చెవులు, ముక్కు, నోరు వంటివి ఉంటాయి. ఇవి కాక పెల్విక్ భాగానికి వస్తే అక్కడ పిరుదులు, మూత్రాశయం, స్త్రీలలో అయితే గర్భాశయం ఉంటాయి. ఈ క్రమంలో వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
బ్రీతింగ్ ఎక్సైర్ సైజ్‌లతో కంటిభాగంలో ఎటువంటి రో గాలు రావు. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసే సమయంలో రెండు చేతులను ఊపిరితిత్తుల కింద ఉంచాలి. అనంతరం శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలాలి. ఇలా రోజు ఉదయం పూట ఐదు సార్లు చేస్తే ఫలితం దక్కుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ విధంగా గాలిని తీసుకునే సమయంలో రెండు భుజాలను పైకి లేపాలి. అనంతరం గాలిని వదిలే సమయంలో భుజాలను కిందకు దించాలి. దీనికి కూడా సాయంత్రం సమయాల్లో ప్రాక్టీస్ చేయాలి. దీన్నే బెల్లీ బ్రీతింగ్ అని కూడా అంటారు. పొట్టతో శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకున్న సమయంలో పొట్టను నింపాలి. వదిలే సమయంలో బలంగా గాలిని బయటకు వదలాలి. దీంతో పొట్ట ఒక్కసారిగా బయటకు, లోపలకు వెళుతుంది. ఇలా చేయడం వల్ల కంటి సమస్యలే కాదు.. ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు కూడా పోతాయి.