యోగా సాధనలో సక్రమ ఫలితాల కోసం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఉదయం పూట ప్రశాంతంగా ఉన్నప్పుడు, శరీరం తేలికగా ఉందని తోచినప్పుడు యోగాను అభ్యసించాలి. లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని మొఖం బాగా కడుక్కోవాలి.
నాశిక రంధ్రాలను గొంతులో బాగా శుభ్రం చేసుకోవాలి. ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లను తాగి, కొద్ది నిమిషాల తరువాత యోగా చేయడం ప్రారంభించాలి. ప్రాణాయామం చేసేటప్పుడు మరీ కష్టంగా అనిపిస్తే ఆపడం చాలా మంచిది. యోగా వల్ల డిప్రెషన్ తొలగిపోయి శక్తిని పుంజుకోవాలే కానీ, యోగాసనాలు వేసే సమయంలో సుదీర్ఘంగా, లయబద్ధంగా శ్వాస పీల్చుకోవడం, అలాగే, శ్వాసను ముక్కు నుంచి మాత్రమే వదులుతూ.. నోరు మూసుకొని ఉండటం మంచిది.