యోగా అనగానే.. శుద్ధ శాఖాహారం తీసుకుంటూ చేసే ఆసనాలు, ధ్యానం గుర్తుకు వస్తాయి. యోగా తరగతులు చెప్పే వారు చాలా కఠిన నిబంధనలు పాటించాలని కూడా చెబుతుంటారు. అంతేకాకుండా, యోగా చేసే వారు మద్యం, మాంసాహారాలు దూరంగా ఉండాలని చెబుతుంటారు. ఆస్ట్రేలియాలోని యోగా గురువులు మాత్రం ఇందుకు భిన్నంగా చెబుతున్నారు. మద్యం తాగి యోగా చేయ వచ్చని వారు పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా యోగా గురువులు కొత్తగా బీరు యోగా ప్రారంభించారు.
బీరు యోగా వల్ల ఉపయోగం ఏమిటంటే..? బీరు తాగి యోగా చేస్తే త్వరగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వారు చెబుతున్నారు. మద్యం మత్తును యోగాకు జత చేయడం చాలా ఏళ్ల నుంచి ఉన్న చోగా ప్రక్రియ అని చెబుతుంటారు. బీరుతాగి యోగా చేస్తే ఉన్నత చైతన్యాన్ని పొందొచ్చని, ప్రస్తుతం ఈ బీరు యోగా ఆస్ట్రేలియాను ఒక ఊపు ఊపేస్తుంది. సిడ్నీ నగరంలో పెద్దఎత్తున ప్రజలు బీరు యోగా తరగతులకు హాజరవుతున్నారు. బీరు తాగి యోగా చేయడమే కాకుండా.. బీరు సీసాలను బ్యాలెన్స్ చేస్తూ ఆసనాలు చేస్తున్నారు.