Home / ANDHRAPRADESH / వైఎస్ జగన్ అడుగు జిల్లాలో పడగానే వైసీపీలో చేరిన పలువురు ప్రముఖులు

వైఎస్ జగన్ అడుగు జిల్లాలో పడగానే వైసీపీలో చేరిన పలువురు ప్రముఖులు

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జాల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర జనసంద్రమైంది . వైఎస్‌ జగన్‌ 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర గురువారం జిల్లాలోని పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెలిచేరు, వడ్డిపర్రు క్రాస్‌ మీదుగా పులిదిండి చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉచిలి, ఆత్రేయపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. అయితే జగన్‌ను కలవడానికి వేలాదిగా జనం తరలివచ్చారు. ముఖ్యంగా పాదయాత్రలో జగన్‌ను చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా పలకరించారు. ఏం దిగులు చెందొద్దు వైసీపీ ప్రభుత్వం వస్తే అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. మరోపక్క వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి.

see also:మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకి రాజీనామా..ఈ నెల 20న భారీ ర్యాలీతో వైసీపీలోకి

తాజాగా మంగళవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న వైఎస్‌ జగన్‌ సమక్షంలో రాజమహేంద్రవరం నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పార్టీలో చేరారు. సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యాన ప్రముఖ వ్యాపారవేత్త పిల్లి సిరిబాల, గౌతమీ జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్‌ పోలసనపల్లి హనుమంతురావు, మాజీ కార్పొరేటర్‌ సూరవరపు రాజ్యలక్ష్మి, రామారావు, పెద్ద వెంకటేశ్వర్లు, చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి పార్టీలో చేరారు. వారికి వైఎస్ జగన్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ, కొత్తగా పార్టీలో చేరినవారు పార్టీ అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందించాలని, జగన్‌ను ముఖ్యమంత్రి చేసేంతవరకూ అహర్నిశలూ శ్రమించాలని సూచించారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ నగర మాజీ అధ్యక్షుడు నక్కా శ్రీనగేష్‌ రాజమహేంద్రవరంలో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.

see also:చంద్ర‌బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన జ‌గ‌న్‌..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat