గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరవేస్తూ.. మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈమేరకు ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులకు తేల్చి చెప్పేశారు. ఆనం కొంతకాలంగా వైసీపీలోకి చెరుతాడని ఊహాగానాలు కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. దానికితోడు జిల్లా మహానాడు, విజయవాడ మహానాడులకు ఆయన గైర్హాజరవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకొంది. ఈ క్రమంలో ఆయన ఆత్మకూరు నియోజకర్గంలోని మండలాల ముఖ్య నాయకులను బుధవారం పిలిపించారు.
see also:చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించిన జగన్..!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీలో ఇంక ఇమడలేమని, వీడాలని నిర్ణయించుకొన్నట్లు వివరించారు. అందుకు దారి తీసిన కారణాలు వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల బరిలో ఉంటానని ఈ విషయంలో అపోహ వద్దని నాయకులకు తేల్చి చెప్పారు. ఏ పార్టీలో ఎప్పుడు ఎలా చేరాలనే విషయం ఈ నెల 20వ తేదీన ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరితో మాట్లాడి నిర్ణయిస్తామని తెలిపారు. అంతేకాదు ఖచ్చితంగా వైసీపీలోకి చేరుతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆనంకు జిల్లా స్థాయిలో అభిమానులు, నాయకులు ఉన్నారు. వైసీపీ ఖంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి చేరితే బాగుంటదని ఆయన కార్యకర్తలు,అభిమానులు తెలిపినట్లు సమచారం. దీంతో దాదాపుగా వైసీపీలోకే అని నెల్లూరు జిల్లా వాసులు అంటున్నారు.