పద్మమును పోలి యుండుట వలన ఈ ఆసనానికి పద్మాసనం అని పేరు వచ్చింది.
విధానము :
మొదట రెండు కాళ్ళను చాపి నేల పై వుంచాలి, తర్వాత కుడి కాలుని ఎడమ తొడపై, ఎడమ కాలుని కుడి తొడపై వుంచి, రెండు చేతులనూ మోకాళ్ళపై వుంచాలి, చిన్ముద్రను వుపయోగించాలి, భ్రూమద్యమున దృష్టిని నిలపాలి, వెన్నెముకని నిటారుగా వుంచాలి.
see also:ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ ముద్రలు..!!
శారీరక ఫలితాలు:
1) తొడబాగములోని అనవసర కొవ్వు కరుగుతుంది.
2) వెన్నెముక బలపడుతుంది.
3) శ్వాస సంబందిత వ్యాదులు క్రమక్రమముగా నిదానిస్తాయి.
మానసిక ఫలితాలు:
1) ద్యానానికి ఇది అనుకూలమైన ఆసనం.
2) ఏకాగ్రత కుదురుతుంది.
3) బుద్ది తీక్షణత పెరుగుతుంది.
4) ఆయుః ప్రమాణము పెరుగుతుంది.