నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో టీడీపీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో పలువురు టీడీపీ నేతలు మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే అనీల్ కుమార్‌ను ఓడిస్తామని చెప్పారు. అంతేకాకుండా, ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్‌పై ఒక సాధారణ టీడీపీ కార్యకర్తను పోటీ చేయించి మరీ ఓడిస్తామని టీడీపీ శ్రేణులు సభ వేదికగా అన్నారు.
see also:వైఎస్ జగన్‌పై ఎంపీ మురళీ మోహన్ సంచలన వ్యాఖ్యలు..!
ఆ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. పులివెందులలో వైఎస్ జగన్‌ను, గుడివాడలో కొడాలి నానిని, అలాగే, నగరిలో ఆర్‌కే రోజాను, నెల్లూరు నగరంలో తనను ఓడించే మగాడు ఇంకా పుట్టలేదన్నారు. ఇలా సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ మరో సారి వార్తల్లో నిలిచారు.