Home / ANDHRAPRADESH / కర్నూల్ జిల్లాలో వెయ్యి మందితో వైసీపీలో చేరిన మరో నేత..!

కర్నూల్ జిల్లాలో వెయ్యి మందితో వైసీపీలో చేరిన మరో నేత..!

ఏపీలో ఎక్కడ చూసిన వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో రాజకీయం సెగలు రేపుతుంది. ఆనాడు కాపులను బీసీలో, వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని కులాల మధ్య సీఎం చంద్రబాబు చిచ్చుపెట్టారని వైసీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. అంకిరెడ్డిపల్లెకు చెందిన అన్నెం జయరామిరెడ్డి సోదరులతోపాటు సర్పంచ్‌ రాముడు, వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, కనకాద్రిపల్లెకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు దస్తగిరి.. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కాటసాని రామిరెడ్డి, నియోజకవర్గ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.

ఈసందర్భంగా నిర్వహించిన బహిరంగ సభనుద్దేశించి శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడారు. ఎన్నికల కంటే ముందు రూ. 87 వేల కోట్ల రుణ మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక రూ. 13,500 కోట్లు మాత్రమే మాఫీ చేస్తామని రైతులను నిలువునా ముంచారన్నారు. పొదుపు మహిళల రుణాలు మాఫీ చేయకుండా రూ.10వేలు ఇస్తామని మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి రూ.2వేలు ఇస్తామని యువతకు భరోసా కల్పించి..తీరా ఎన్నికలు సమీపిస్తుండటంతో వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించడం విడ్డూరమన్నారు. దళితులకు ఏఒక్కరికైనా రెండెకరాల భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎక్కడా చూసినా ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించి వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారన్నారు. తాను 91 రోజులకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే 15 రోజుల్లోనే ఆమోదించారని, వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరానని, వారి చేత రాజీనామా చేయించే దమ్ము సీఎంకు లేదా అని ప్రశ్నించారు.

see also:

వైఎస్ జగన్ అడుగు జిల్లాలో పడగానే వైసీపీలో చేరిన పలువురు ప్రముఖులు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat