ప్రజా పాలనను మరింత ఫలవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన మననగరం విషయంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో నగరవాసుల భాగస్వామ్యం, స్పందన ఎలా ఉంది? వీటిని సమర్థవంతంగా అమలు చేయడానికి సలహాలు, సూచనలు స్వీకరించడం, స్థానికులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి ప్రాధాన్య సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారం చూపించే కార్యక్రమమే “మన నగరం”. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీతో పాటు జలమండలి, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖలు అమలు చేస్తున్న అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలను మరింత భాగస్వామ్యం చేసేందుకుగాను “మన నగరం” పేరుతో మంత్రి కే తారకరామారావు ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు.
see also;బిగ్ బాస్-2 ..కత్తి కార్తీక సంచలన వాఖ్యలు..!!
గ్రేటర్ హైదరాబాద్‌లో నియోజకవర్గాలవారిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు నిర్వహించే ఈ మన నగరం కార్యక్రమాన్ని డిసెంబర్ 16న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రారంభించిన విషయం విదితమే. ఇప్పటి వరకు కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాలలో మన నగరం కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ నిర్వహించారు. తాజాగా నగరంలోని తూర్పు ప్రాంతంపై తాజాగా సమావేశాన్ని నిర్వహించనున్నారు. గురువారం నాడు ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ మన నగరం కార్యక్రమం నిర్వహించనున్నారు. నాగోల్‌లోని దేవకి కన్వెన్షన్ హాల్‌లో జరిగే ఈ మన నగరం కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, ఎంపి సి.హెచ్.మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, తీగల కృష్ణారెడ్డిలతో పాటు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించే కార్పొరేటర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారు.
see also:నాయిని రాజేందర్‌రెడ్డికి రంజిత్ రావు సవాల్..!!
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు వార్డులకు సంబంధించిన వివిధ వర్గాలకు చెందిన 450మందిని ప్రత్యేకంగా ఈ మన నగరం కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఎంపిక చేశారు. గురువారం ప్రారంభమయ్యే మన నగరం కార్యక్రమంలో స్వచ్ఛ కార్యక్రమాల అమలులో నగరవాసుల భాగస్వామ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో స్థానికుల పర్యవేక్షణ, అన్నిరకాల పన్నుల చెల్లించడంలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ కమిటీల భాగస్వామ్యం తదితర అంశాలపై కాలనీ సంక్షేమ సంఘాలు, స్వయం సహాయక బృందాలు, ఏరియా, బస్తీ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి, జలమండలి ఎండి దాన కిషోర్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, మేడ్చల్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి, విద్యుత్, రోడ్లు, భవనాలు, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.