తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి సర్దాపూర్‌లో వ్యవసాయ కళాశాల భవనానికి వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ తనలోని మానవీయ కోణాన్ని మరోమారు ఆవిష్కరించారు.
see also:కనిపించని నెలవంక..రంజాన్ పండుగ రేపు
కిడ్నీ సంబంధిత వ్యాధి తో బాధపడుతున్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన దుంపలపల్లి నాగమణికి తప్పకుండా సాయం చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు .బాధితురాలిని చికిత్స నిమిత్తం రేపు హైదరాబాద్‌కు తీసుకురావాలని స్థానిక టీఆర్‌ఎస్ నేతకు సూచించారు.ఈ క్రమంలోనే ఆమె ఈ రోజు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నది.
కృతజ్ఞతాభావంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన మాటప్రకారం 24 గంటల్లోనే ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపురం చెందిన కిడ్నీ బాధితురాలు నాగమణిని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.ఈ సందర్భంగా మానవీయ కథనాలకు స్పందిస్తున్న మంత్రి కేటీఆర్ తీరును పార్టీలకతీతంగా పలువురు ప్రశంసిస్తున్నారు.