ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జగన్ పాదయాత్రలో పాల్గొని వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. ఎంతో సహనంతో, సానుకూలంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, మీకు నేనున్నాను అన్న భరోసాను ప్రజలకు కల్పిస్తూ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
see also:చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించిన జగన్..!
ఓ పక్క సమస్యలను తెలుసుకుంటూనే.. మరో పక్క వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలా జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, మంగళవారం సాయంత్రం జగన్ తన పాదయాత్ర ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జగన్ తూర్పుగోదావరి జిల్లాలో అలా అడుగు పెట్టాడో లేదో.. ఇసుకవేసినా రాలనంత జనం ప్రజా జగన్ కోసం సముద్రంలా పోటెత్తారు. జగన్ అడుగులో అడుగు వేసేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే రాజమండ్రి రైల్ కమ్ రోడ్డు వంతెన జనసందోహంతో నిండిపోయింది. బ్రిడ్జీ మొత్తం తూర్పుగోదావరి జిల్లా ప్రజలతో నిండిపోయింది.
see also;ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌పై చంద్రబాబు రహస్య సర్వే..!
ఒక సమయంలో.. బ్రిడ్జీ కూలిపోతుందేమో అనేంతలా జనం జగన్ కోసం వచ్చారు. ఇదిలా ఉండగా, జగన్ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా రాజమండ్రి వంతెన దాటుతున్న దృశ్యాలను ప్రసారం చేసేందుకు పలు ఛానెళ్లు ఆసక్తి చూపాయి. అందులో పచ్చమీడియా ఛానెళ్లు కూడా భాగమయ్యాయి. ఎప్పుడూ ప్రసారం చేయనంతగా ఆ పచ్చ ఛానెళ్లు జగన్ ప్రజా సంకల్ప యాత్రను లైవ్ టెలికాస్ట్ చేశాయి. ఇలా పచ్చ మీడియా సైతం జగన్‌కు జై కొట్టడంతో టీడీపీ శ్రేణులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.