వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్ ఇప్పటి వరకు తన పాదయాత్రను వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు.
see also:మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకి రాజీనామా..ఈ నెల 20న భారీ ర్యాలీతో వైసీపీలోకి
ఇదిలా ఉండగా, 2014 సాధారణ ఎన్నికల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముఖ్యకారణం ఉభయగోదావరి జిల్లాల ప్రజలే అన్న విషయం తెలిసిందే. ఆ రెండు జిల్లాల్లో టీడీపీ అత్యధిక ఎమ్మెల్యే సీట్లను గెలుపొందడంతో వైసీపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం తృటిలో చేజారింది. అయితే, ఆ సీన్ 2019లో రివర్స్ కానుంది. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో జగన్ తన పాదయాత్ర ద్వారా అడుగుపెట్టిన దృశ్యాలను చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. నాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో వచ్చిన స్పందనే.. నేడు జగన్ ప్రజా సంకల్పయాత్రకు వచ్చింది. నాడు వైఎస్ఆర్ పాదయాత్ర అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, 2019లో కూడా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారన్న సంకేతాన్ని ఉభయ గోదావరి జిల్లా ప్రజలు ఇచ్చారు. ఏదేమైనా వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా ఎంట్రీ చూసిన అధికార పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టాయని ఆ పార్టీ కేడరే చెబుతోంది.,