తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి….బంగారు తెలంగాణ రూపుదిద్దుకోవడం ఆర్థిక శాఖ మంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్న మంత్రి ఈటల రాజేందర్ తాజాగా ఆశ్చర్యకరమైన పని చేశారు. తన ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో మంత్రి ఈటల మరోమారు నిరూపించుకున్నారు.
see also:జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు
ఉద్యమ సమయంలో నమోదైన కేసు విషయంలో కాజీపేట రైల్వే కోర్టుకి హాజరైన మంత్రి ఈటల ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
see also:ఎల్బీనగర్ మెట్రో ప్రారంభం విషయంలో మంత్రి కేటీఆర్ క్లారిటీ
తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్,ఆయన అనుచరులపై రైల్వే కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆర్థిక శాఖామంత్రి కాజీపేటలోని రైల్వే కోర్టుకి హాజరవుతున్నారు. అయితే, అక్కడ ఉన్న అసౌకర్యాలను గమనించిన మంత్రివర్యులు ఈరోజు కాజీపేటలోని రైల్వే కోర్టుకి సామాగ్రిని బహూకరించారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న సిబ్బంది మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి గొప్ప తనం మంత్రి ఈటలకే సాధ్యమని పలువురు అంటున్నారు.