అటు కోలీవుడ్లోను, ఇటు టాలీవుడ్‌లోనూ లేడీ సూపర్‌స్టార్‌గా పేరొందిన అనుష్క పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎప్పట్నుంచో అనుష్క పెళ్లిపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వయస్సు ముదిరిపోతుంది కాబట్టి.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అన్న ప్రశ్నలు పలు సందర్భాల్లో అనుష్కకు ఎదురయ్యాయి కూడాను. అయితే, ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పేందుకు అనుష్క రెడీ అయిపోయింది. ఇంతకీ అనుష్క ఏం చేయబోతోంది అనేగా మీ డౌట్. అదేనండీ. అనుష్క పెళ్లిపీలు ఎక్కబోతోంది అన్న మాట.
see also:హీరో విశాల్‌పై వైరల్ న్యూస్..!
ఇక అసలు విషయానికొస్తే.. వరుస సినిమాలతో బిజీ జీవితాన్ని గడుపుతున్న అనుష్క వద్ద పెళ్లి మాట ఎత్తేందుకు భయపడ్డ కుటుంబ సభ్యులు.. ఇప్పుడ కాస్త ధైర్యం చేసి అనుష్కను పెళ్లికి ఒప్పించారట. అనుకున్నదే తడవుగా అనుష్క పెళ్లికి ఏమైనా గండం ఉందా..? అన్న అనుమానంతో జోతిష్యం కూడా చెప్పించారట. అనుష్క జాతకం ప్రకారం అంతా మంచే జరుగుతుందని, త్వరలోనే పెళ్లి జరగనుందని జ్యోతిష్యుడు చెప్పిన మాటలతో అనుష్క ఫ్యామిలీ కాస్త హ్యాప్పీగా ఫీలైందట. ఏదేమైనా అనుష్క పెళ్లి వార్త విన్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి అనుష్కను చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
see also:డేంజర్ జోన్లో మెగా హీరో..!