కర్ణాటక రాష్ట్రంలోని జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన మాజీ హోమ్ శాఖ మంత్రి రామలింగారెడ్డి కూతురు సౌమ్యా రెడ్డి బీజేపీ పై 4 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. సౌమ్యారెడ్డికి 54,045 ఓట్లు రాగా, ప్రహ్లాద్ కు 50,270 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి మరో సీటు వచ్చి చేరినట్లయింది.
అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో భాగంగా మొదటగా 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలోకి వెళ్లిన సౌమ్యారెడ్డికి, ఆపై రౌండ్లలో మెజారిటీ తగ్గుతూ వచ్చింది.ఇలా రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంచెం ఆందోళన కనిపించింది. చివరకు ఏమవుతుందా? అన్న టెన్షన్ అందరిలో నెలకొనగా, ఇంటికి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్ తిరిగి కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు . చివరకు సుమారు 4 వేల ఓట్ల మెజారిటీతో సౌమ్యా రెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకొని సంబరాలు చేసుకుంటున్నారు.