యోగా అనేది ఒకటి రెండు వారాలు, నెలలు చేసేసి ఆపేసేది కాదు. అదొక నిరంతర ప్రక్రియ. దాన్ని అభ్యసిస్తున్న కొద్దీ శరీరం తేలిక అవుతుంది. ఆలోచనలు దారికి వస్తాయి. జీవన శైలిలో మంచి మార్పు వస్తుంది.
ఆల్ రౌండర్ ఫిట్‌నెస్ :
శరీర ఆరోగ్యం ఒక్కటే కాదు, మానసికంగా, భావోద్వేగాల పరంగా కూడా సమతుల్యత ఉన్నప్పుడే మొత్తం ఫిట్‌గా ఉన్నట్టు లెక్క. ఎంత సంతోషంగా, ఉత్సాహంగా జీవిస్తారన్నదే ఆరోగ్యానికి కొలమానం. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం – ఇవన్నీ కలిసి ఒక ప్యాకేజీగా దానికి దోహదపడతాయి.
బరువు తగ్గడం :
అందరికీ కావాల్సింది బరువు తగ్గడమే. సూర్య నమస్కారాలు, కపాలభాతి ప్రాణాయామం బరువు తగ్డంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా యోగా చేసేటప్పుడు మనకు తెలియకుండానే మనం తీసుకొనే ఆహారం పట్ల శ్రద్ధ ఏర్పడుతుంది. దానివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
ఒత్తిడి నివారణ :
ఉదయాన్నే కొద్దిసేపు యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు. శరీరంలోని మలినాలను వదిలించడంతోపాటు మనస్సు పరిశుభ్రంగా ఉండటానికి యోగా ఉపయోగపడుతుంది.
ప్రశాంతత:
ప్రకృతిలోని ప్రశాంతమైన, సుందరమైన ప్రదేశాలంటే మన అందరికీ ఇష్టమే. కాని ప్రశాంతత కోసం ఎక్కడికో వెల్లనవసరం లేదు. అది మనలోనే ఉంటుంది. రోజుకోసారి లోపలికి ప్రయాణించి దాని అనుభూతి చెందవచ్చు. అల్లకల్లోలంగా ఉన్న మనస్సును కుదుటపరిచేందుకు యోగాను మించిన సాధనం లేదని నిపుణులు చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తి :
శరీరం, మనస్సు, మేధ – అన్నీ కలిస్తేనే ఆరోగ్యం. యోగా అవయవాలకు సరిపడా శక్తినిస్తుంది. కండరాలను దృఢం చేస్తుంది. శ్వాస టెక్నికల్‌లు, ధ్యానం ద్వారా స్ట్రెస్ తగ్ఇ రోగ నిరోఝధక శక్తి పెరుగుతుంది.
అవగాహన :
మన ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. గతం, భవిష్యత్తులకు సంబంధించిన అనేక అంశాలతో అది పరుగులుపెడుతూ ఉంటుందేకాని వర్తమానంలో ఎప్పుడు ఉండదు. యోగ, ప్రాణాయామాల వల్ల ఈ సత్యం అవగాహనలోకి వస్తుంది. దాంతో ఆలోచనలను నియంత్రించడం సులువు అవుతుంది. .
మెరుగైన సంబంధాలు :
జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సహోదరులు, స్నేహితులు – ఇలా చుట్టూ ఉన్న అన్ని బంధాలను మెరుగు చెయ్యడంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రశాంతమైన మనస్సు ఉంటే.. కష్టమైన పనులను కూడా ఇష్టంగా చేసేందుకు వీలుగా ఉంటుంది. అది కేవలం ఒక్క యోగాతోనే సాధ్యం. ఇలా యోగా సాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలోన్నో ఉన్నాంటూ వైద్యులతోపాలు.. యోగా నిపుణులు చెబుతున్నారు.