వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి గ్రేటర్ వరంగల్ టీఆర్‌ఎస్ 48వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్ రావు సవాల్ విసిరారు.కమీషన్ల కోసం పనులను ఆపుతున్నానని నిరూపిస్తే, తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు .మంగళవారం హన్మకొండ సుబేదారిలోని డివిజన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంజిత్ మాట్లాడారు.
see also:తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్..!!
పాదయాత్రలో నాయిని రాజేందర్‌రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలని ఈ సందర్భంగా రంజిత్ డిమాండ్ చేశారు. 48వ డివిజన్‌లో ఇప్పటి వరకు రూ. 3కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. హౌజింగ్ బోర్డ్ కాలనీలో చేపట్టిన సీసీ రోడ్లు, వేసవి కాలంలో నిర్మాణం చేస్తే పగిలిపోతాయనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ ఆపారు తప్పా కమీషన్ల కోసం కాదని స్పష్టం చేవారు.కమీషన్ల సాంప్రదాయం టీఆర్ఎస్ పార్టీది కాదని.. కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆయన ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ , స్థానిక ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ల సహకారంతో కాలనీ అభివృద్ధి చెందిందన్నారు. గతంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ మళ్లీ గెలుస్తుందనే భయంతో రాజేందర్‌రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టాడని విమర్శించారు.