ఇలా చేస్తే మధుమేహం మన మాట వింటుంది. షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ల వద్దకు పరుగులు తీయాల్సిన పనిలేదు. వేలాది రూపాయలు ఖర్చుపెట్టి మందులు కొనాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ వరానికి నాలుగు గుడ్లు తింటే చాలు. ఒకప్పుడు ఓ వయస్సు దాటిన వారిలో కనిపించే ఈ సమస్య ఇప్పుడు పిల్లల్ని కూడా పట్టి పీడిస్తోంది.
డయాబెటీస్ భారిన పడి ఆస్పత్రుల చుట్టూరా తిరుగుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు ప్రజలను డయాబెటీస్ భారిన పడేలా చేస్తున్నాయి. అయితే, వైద్యులు చెప్పే సలహాలను కాకుండా యోగాసనాలను సైతం రోజువారీగా చేస్తే డయాబెటీస్ దరిదాపులకు కూడా రాదని వైద్యులు చెబుతున్నారు.