ఈ రెండు యోగా ఆసనాలతో నిత్య యవ్వనంగా కనిపించండి. వయస మల్లడం అత్యంత సహజ పరిణామం. కొన్ని యోగ ఆసనాల ద్వారా వయసు మల్లడాన్ని పూర్తిగా ఆపకున్నప్పటికీ కొంచెం వాయిదా వేయవచ్చు. ఈ యోగాసనాలను పరిశీలిద్దాం.
మాలపాన :-
యోగామ్యాట్‌పై నిటారుగా నిలబడండి. మెల్లిగా పాదాలు వెడం చేస్తూ, సుమారుగా రెండు కాళ్ల మధ్య కనీసం మూడు ఫీట్ల వెడం ఉండేలా చూండండి, ఇప్పుడు రెండు చేతులను దగ్గరికి తీసుకొస్తూ దండం పెడుతున్న పోసిషన్‌లోకి తీసుకురండి. ఇప్పుడు మోకాళ్ల దగ్గర వంచి మీ కోర్ భాగాన్ని నెమ్మదిగా కిందకు దించండి . వీలైనంతగా కిందకు దించండి. ఇలా మూడు నాలుగు సెకండ్స్ ఉంచి తిరిగి సాధారణ స్తితిలోకి రండి. ఇలా ఆరు సార్లు చేయండి.
ఉత్కటాసన :-
ఇది శరీరంలోని వివిధ సాగులకు సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా పిరుదుల భాగంలో ఏ ఏజ్‌తోపాటు సంభవించే సాగుడను నివారిస్తుంది. యోగమ్యాట్ పై నిటారుగా నిలబడండి. రెండు కాళ్లను దగ్గరగా ఉంచుతూ నిటారుగా నిలబడండి. రెండు చేతులు దండం పెడుతున్న పోజ్ లోకి తీసుకురండి. చేతులను తలపైకి అలాగే లేపండి. ఇప్పుడు మెల్లిగా మోకాళ్ల దగ్గర వంచి శరీరాన్ని కుర్చీ ఆకారంలోకి తీసుకురండి. ఇలాగే ఒక ఆరు సెకండ్లు ఉంచి తిరిగి మొదటి పోజీషన్‌లోకి రండి. దీన్ని నాలుగుసార్లు పునరావృతం చేయాలి.