యోగాసనం అనేది ప్రాణశక్తికి సంబంధించినది. వ్యాయామం అనేది శరీరంలోని కండరానికి సంబంధించినది. ఒక వ్యక్తి వ్యాయామం చేసే సమయంలో శ్వాసను నియంత్రణ చేయలేడు. ఆ సందర్భంలో ఆ వ్యక్తికి ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. వ్యాయామం చేసే వారు ఆరోగ్యంగాగాను, అలాగే, శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటారు. కాకపోతే, వ్యాయామం వల్ల శారీరక బలమే తప్ప మానసికంగా బలం కలగదు. ఆలోచనాపరంగాను అదుపులో ఉండలేరు.
అయితే, యోగా చేసే ప్రతీ ఒక్కరు శక్తిని పొందడంతోపాటు ఆరోగ్యంగా ఉంటారు. యోగాలో ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలు నిరంతరం అదుపులో ఉంటాయి. దీనివలన శరీరంలో ఏ ఒక్క అవయవం బ్లాక్ అయి ఉన్నా.. ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసల ప్రక్రియలో భాగంగా అవి తెరుచుకోబడతాయి. బాడీ చాలా తేలిగ్గా ఉంటుంది. ప్రాణ శక్తి పెరుగుతుంది. మనస్సుకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.