వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ ప్రారంభించిన పాదయాత్ర కాసేపటి క్రితమే పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైలు కమ్ రోడ్ వంతెనకు చేరుకుంది. అక్కడ్నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రతో తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు.
see also:రాజమండ్రి బ్రిడ్జీ గురించి సంచలన నిజాలు చెప్పిన ఇంజినీర్లు..!
అయితే, జగన్ తూర్పుగోదావరి జిల్లాలో అడుగు పెట్టగానే వరుణ దేవుడు చిరుజల్లులతో స్వాగతం పలికాడు. దీంతో అక్కడి వారంతా జగన్ పాదయాత్ర తమకు శుభ పరిణామమంటూ నినాదాలు చేశారు. జై జగన్.. జై జగన్ అంటూ కేకలు వేశారు. జగన్ రాజమండ్రి బ్రిడ్జీకి చేరుకోగానే.. అకడ్నుంచి జగన్‌పై పూల వర్షం కురిపించారు.