రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీరుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిదా అయిపోయి ఉంటారని పలువురు చర్చించుకుంటున్నారు. కీలకమైన అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించిన మానవత విధానం ఈ చర్చకు కారణం. పూరిగుడిసెలో ఉన్న ఓ వృద్ధురాలి కుటుంబానికి రూ.500 ప్రాపర్టీ ట్యాక్స్ విధించిన చర్యపై తప్పిదాన్ని సరిదిద్దాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వారికి డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించడంతో పాటుగా, ఆసరా పెన్షన్ సైతం కేటాయించాలని కోరారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్ అధికారులకు ఈ అదేశం ఇచ్చారు.
This aged couple living in a hut from Komaram Bheem Asifabad District has been asked to cough up Rs. 500 property tax. Local officials’ apathy is sickening. Appeal to @TelanganaCMO & @KTRTRS for refunding tax paid & rehabilitating the couple in a double bedroom house immediately. pic.twitter.com/JfPK08qNHW
— Uttam Kumar Reddy (@UttamTPCC) June 12, 2018
కొమురం భీం జిల్లాకు చెందిన ఓ వృద్ధ దంపతులు శిథిలావస్థలో ఉంటున్నారు. ఇలాంటి నివాసంలో ఉన్న ఆ దంపతులకు స్థానిక అధికారులు రూ.500 ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలనిరశీదు అందించారు. ఈ విషయాన్ని పేర్కొంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసి తగు న్యాయం చేయాలన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ‘ఉత్తమ్‌కుమార్ రెడ్డిగారు..ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. కొమురం భీం జిల్లా కలెక్టర్‌గారు ఈ విషయాన్ని స్థానిక పంచాయతీ కార్యదర్శితో పర్యవేక్షించి తప్పిదాన్ని సవరించాలని కోరుతున్నాను. దీంతోపాటుగా వాళ్లకు డబుల్ బెడ్రూం ఇళ్లు అందకపోయినా, ఆసరా పించన్ ఇప్పటివరకు ఇవ్వకపోయినా ఆ రెండూ అందేలా చర్యలు తీసుకోగలరు’ అని ట్వీట్‌లో కోరారు.
Thanks Uttam Kumar Reddy Garu for bringing it to my notice
Request the @Collector_KB to direct local panchayat secretary to rectify this mistake@Collector_KB to also provide them with 2BHK and Aasara pension if they aren’t already revving it https://t.co/MstrswhWcD
— KTR (@KTRTRS) June 12, 2018