జబర్దస్త్‌లో తన నవ్వులతో అలరిస్తున్న చలాకీ చంటికి ఇవాళ పెను ప్రమాదం తప్పింది. చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం 44వ జాతీయ రహదారిపై ఆయనకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చంటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.