ఒకేసారి భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు గత రెండు వారాల నుండి తగ్గుతూ వస్తున్న సనగతి తెలిసిందే.తాజాగా ఇవాళ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి.పెట్రోలు ధరపై 15 పైసలు, డీజెల్ ధరపై 10 పైసలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. అయితే తాజాగా తగ్గిన ధరల వివరాలను చూస్తే..దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 76.43, కోల్ కతాలో రూ. 79.10, ముంబైలో రూ. 84.26, చెన్నైలో రూ. 79.33గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 80.96గా ఉంది. అదే విధంగా డీజెల్ ధర ఢిల్లీలో రూ. 67.85, కోల్ కతాలో రూ. 70.40, ముంబైలో రూ. 72.24, చెన్నైలో రూ. 71.62గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 73.75గా ఉంది.