ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా నేడు మంగళవారం రాజమండ్రి సాక్షిగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రతో అడుగు పెట్టారు .అయితే ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది .ఈ క్రమంలో జగన్ పశ్చిమ గోదావరిలో పాదయాత్రను పూర్తి చేసుకుని తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు
see also:రాజమండ్రి వంతెనపై జగన్‌కు స్వాగతం పలికింది ఎవరో తెలిస్తే షాక్..!
రాజమండ్రిలో ఎంతో చారిత్రక రోడ్ కం రైల్ బ్రిడ్జి మీదుగా ఆయన సుమారు లక్ష మంది నాయకులూ,కార్యకర్తలతో రాజమండ్రీ నగరానికి చేరుకున్నారు.అంతే కాకుండా సుమారు ఆరు వందల పడవుల్లో వైసీపీ జెండాలను ,బెలూన్లను గాలిలోకి వదిలారు.దీంతో రాజమండ్రి ప్రాంతమంతా ,గోదావరి నది అంతా వైసీపీ జెండాలతో ,లక్షమంది ప్రజలతో కిటకిట లాడుతుంది.