వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇవాళ జగన్ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ముగించుకొని సాయంత్రం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది.ఈ సందర్భంగా వైసీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు.
see also:రాజమండ్రి బ్రిడ్జీ గురించి సంచలన నిజాలు చెప్పిన ఇంజినీర్లు..!
ఈ క్రమంలోనే జగన్ కొవ్వూరులోని ప్రముఖ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంమైన గోష్పాద క్షేత్రం చేరుకొన్నారు.ఈ నేపధ్యంలో ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆధ్వర్యంలో ఆయన గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య జగన్ గోదావరమ్మకు హారతినిచ్చారు. అనంతరం ఆలయాన్ని దర్శించుకొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వేద పండితులు జగన్ మోహన్ రెడ్డి ని ఆశీర్వదించారు. గోదారమ్మకు పుణ్య హారతి కార్యక్రమం అనంతరం జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు.