ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో చాలమంది ప్రజలు వారి సమస్యలను జగన్ తో చెబుతున్నారు. తాజాగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల మేం ముగ్గురం అక్కా చెళ్లెల్లం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ చదువుకున్నామని బుట్టాయగూడెం గ్రామానికి చెందిన కోసూరి సంధ్యాకుమారి, కోసూరి సువర్ణ స్వప్న, మల్లవరపు సుష్మ జగన్మోహన్రెడ్డిని కలిసి చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయి మూడేళ్లు అవుతున్నా ఉద్యోగం రాలేదని మీరు వచ్చాక మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉన్నామని చెప్పారు.
see also:ఆ నియోజకవర్గంలో వైసీపీపై పోటీ చేసేందుకు.. ఒక్క మగాడు కూడా లేడంట..!
మా గుండెల్లో వైఎస్సార్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల తనకు గుండె ఆపరేషన్ అయి మళ్లీ జీవిస్తున్నానని చాగల్లుకు చెందిన కొడవటి సత్యనారాయణ అనే వ్యక్తి దారవరంలో జగన్ను కలిసి చెప్పారు. తరచూ వైద్య పరీక్షలు, మందులు వాడాల్సి వస్తుందని ఆర్థికంగా తనకు తోడ్పాటును అందించాలని కోరారు.