రాష్ట్రంలోని వైద్యశాఖలో బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, సమస్యలుంటే వాటిని నియమ నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు అదిగమించాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో మంత్రి సంబంధిత శాఖల వివిధ విభాగాల అధిపతులతో సోమవారం సమావేశమయ్యారు.
see also:మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్
వైద్య ఆరోగ్యశాఖలోని సాధారణ బదిలీల ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీలు పారదర్శకంగా జరగాలన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటి సారిగా వచ్చిన బదిలీలలో ఒత్తిడి ఉండే అవకాశం ఉందన్నారు. అయితే, బదిలీల ప్రక్రియలో దరఖాస్తుల స్వీకరణ, ఖాలీల ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ, జాబితా ప్రకటన వంటి వివిధ స్థాయిల్లో ఏ స్థాయిలో వచ్చే సమస్యలను ఆ స్థాయిలోనే పరిష్కరించుకోవాలన్నారు.
see also:హరిత హారానికి సన్నద్ధం కండి..మంత్రి జూపల్లి
బదిలీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సైతం ఆయా స్థాయిల్లోనే వారి అనుమానాలు నివృత్తి అయ్యేట్లుగా చూడాలన్నారు. అందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తం ఆన్‌లైన్ పద్ధతిలోనే బదిలీలు నిర్వహిస్తున్నందున, ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా బదిలీలు జరగాలని ఆదేశించారు.