సాయిపల్లవి. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌కు ఒక్క అడుగు దూరంలో ఉంది. అంతలా తన నటనతో ఆకట్టుకుంటోంది సాయిపల్లవి. అంతకు ముందు మళయాళ సినీ ఇండస్ట్రీలో తెరకెక్కిన ప్రేమమ్‌తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. దిల్‌రాజు నిర్మించిన ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఫిదా, హేయ్ పిల్లగాడా చిత్రాల్లో సాంప్రదాయంగా, చాలా చక్కగా, అరెరే.. మన పక్కింటి అమ్మాయిలానే ఉందే..! అనేలా పాత్రలను ఎంచుకుంటూ వచ్చింది ఈ పింపుల్స్ బ్యూటీ.
see also:మహేష్ న్యూ లుక్ కి ఫాన్స్ ఫిదా..!!
అయితే, నేనేమీ ఇతర హీరోయిన్లకు తీసిపోను అనేలా గత సంవత్సరం ఎండింగ్‌లో వచ్చిన, నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఎంసీఏ చిత్రంలో తనలోని రొమాన్స్‌ను వెలికి తీసింది. ఇలా తాను కూడా అన్ని పాత్రల్లో నటించగలను అన్న సంకేతాలను సినీ ఇండస్ట్రీకి తెలియజేసింది సాయి పల్లవి. అందులో భాగంగానే కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో ఈ భామ ఛాన్స్ కొట్టేసింది.
see also:సల్మాన్ తరువాత అత్యధిక పారితోషికం కత్రినాదే..! ఎంతో తెలుసా..??
ఇదిలా ఉండగా, ఇటీవల సాయి పల్లవిపై ఓ కథనం వైరల్ అవుతోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సాయి పల్లవి అప్పుడే పెళ్లికి సిద్ధమైపోయిందంటూ ఓ వెబ్‌సైట్ ప్రచురించింది. అయితే, దక్షిణాదిలోని ఓ రాష్ట్ర మంత్రి కుమారుడు పింపుల్స్ బ్యూటీ సాయి పల్లవిని చూసి ఫిదా అయ్యాడని, ఆ వెంటనే నువ్వు నాకు నచ్చావ్.. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానంటూ చెప్పడంతో సాయి పల్లవికి అందుకు నో చెప్పిందట.
see also:” ఈ నగరానికి ఏమైంది ? ” ట్రైలర్ వచ్చేసింది..!!
సాయి పల్లవినే పెళ్లి చేసుకుంటానంటూ చెప్పడంతో ఏకంగా కుమారుడి కోసం మంత్రిగారే రంగంలోకి దిగారు. సాయి పల్లవి తల్లిదండ్రులతో పెళ్లిపై చర్చించారు. ఏకంగా మంత్రే తమ ఇంటికి రావడంతో సాయి పల్లవి తల్లిదండ్రులు ఆందోళన చెందారట. చివరకు తమ కుమారుడికి మీ పిల్లను ఇవ్వమని అడిగేందుకు వచ్చా.. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది, అందుకే వచ్చా.. మీరు ఓకే అంటే పెళ్లి చేసేద్దాం అంటూ చెప్పడంతో సాయిపల్లవి తల్లిదండ్రులు ఒకింత ఆనంద పడ్డారట. పెళ్లి చేసేందుకు వారు అంగీకరించినా.. సాయి పల్లవి ఇటీవల కొన్ని ప్రాజెక్స్ట్‌కు సైన్ చేయడంతో.. ఆ షూటింగ్‌లన్నీ ముగిసిన తరువాత పెళ్లి చేద్దామని ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించినట్టు సమాచారం.