తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు బీమా పథకం కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు జీవిత బీమా లబ్ధిదారుల వివరాల సేకరణ చేపట్టేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపికను ముమ్మరంచేస్తున్నారు. 18 నుంచి 59 ఏండ్ల వరకు వయసుండి.. పట్టాదార్ పాస్ పుస్తకాలున్న రైతులందరికీ రైతు బీమా పథకం వర్తిస్తుంది. దీని అమలుకోసం నామినీ, బీమా దరఖాస్తుల నమూనా ఆధారంగా మొబైల్‌యాప్ రూపొందుతున్నది. వ్యవసాయ విస్తరణాధికారులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. బీమా, నామినీ దరఖాస్తు పత్రాలను ఇప్పటికే అన్నిజిల్లాలకు పంపించామని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి తెలిపారు.
see also:ఈ ఎమ్మెల్యే కేటీఆర్ మనసును ఎందుకు గెలుచుకున్నాడంటే..!!
see also:ఆర్టీసీ యూనియన్ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలం..!!