Home / NATIONAL / తెలంగాణ అభివృద్ధిపై 29 రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ఎన్ఆర్ఐ ప్రతినిధులు ప్రశంసలు..

తెలంగాణ అభివృద్ధిపై 29 రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ఎన్ఆర్ఐ ప్రతినిధులు ప్రశంసలు..

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకొరకై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతుగా  టీఆర్ఎస్  ఆస్ట్రేలియా శాఖ  అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల అధ్యక్షతన, విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్ నగరంలో నిర్వహించిన చర్చావేదికకు అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో భారతదేశానికి చెందిన 29 రాష్ట్రాలకు సంబందించిన అన్ని ప్రధాన ప్రాంతీయ పార్టీల ప్రవాస సభ్యుల మరియు మద్దతుదారులతోపాటు, ప్రవాస భారతీయ మేధావులు, కవులు మరియు వక్తలతో మేధోమధనం, చర్ఛ జరిగింది.

see also:తెలంగాణ చెరువుల్లో చేపల కళ..!!

ఈ కార్యక్రమంలో ముందుగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల తెలంగాణ ఉద్యమ నేపధ్యాన్ని, పద్నాలుగు ఏళ్లపాటు కెసిఆర్ గారు మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని ఎలా ముందుండి నడిపారో, తెలంగాణ సాధించిన తరువాత, బంగారు తెలంగాణగా మార్చుటకు చేస్తున్న అవిరళ కృషిని, ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలనుకళ్లకుకట్టే విధంగా వీడియో రూపంలో ప్రదర్శించారు, అన్ని రంగాల్లో సాధించిన వృద్ధిరేటును రేఖాచిత్రాల రూపంలో ప్రదర్శించిన తీరు, కేవలం నాలుగేళ్లలో కెసిఆర్ గారి నాయకత్వంలో సాధించిన ప్రగతి, కార్యక్రమంలో పాల్గొన్న అతిధులను విస్మయానికి గురిచేసిందిఈ కార్యక్రమం ద్వార ఇంతటి మహోన్నత నాయకత్వం యొక్క ఆవశ్యకత దేశానికి ఎంత అవసరమో చాటిచెప్పే ఒక సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నామని,కేవలం నాలుగేండ్లలో అనితరసాధ్యమైన అభివృద్ధి ప్రణాళికలను, ఆశ్చర్యచకితులను చేసే కె సి ఆర్ గారి రాజకీయ చతురతను, ప్రజాసేవ పట్ల ఆయనకున్న దీక్షా, పట్టుదలలను ప్రవాస భారతీలందరికి తెలియజేసేవిధంగా, ‘బంగారు భారతావని’లో కె సి ఆర్   పాత్రను, కొత్తగా ఏర్పడబోయే ‘ఫెడరల్ ఫ్రంట్’ యొక్క అవసరం,కుంటుపడిన దేశాభివృద్ధి మరియు గత 70 ఏళ్ళ అసమర్థ పాలనలోని అసమానతలను ఎండగడుతూ, మన భారతదేశానికి నేడు అనివార్యమైన నూతన నాయకత్వంపై ఒక సమగ్ర విశ్లేషణతో కూడిన వివరణ ఇచ్చారు.

see also:ఇద్దరు ఇద్దరే ..!

కెసిఆర్ గారి త్యాగనిరతిపై, జరుగుతున్న అభివృద్ధిపై సభ్యులందరు ప్రశంసల జల్లు కురిపిస్తూ, ముక్తకంఠంతో కెసిఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి రావాలనీ, ఈ అభివృద్ధి పథకాలు దేశమంతటా అమలుచేయాలనీ, కెసిఆర్ గారి నాయకత్వంయొక్క ఆవశ్యకత ఎంతో ఉందని ఉద్గాటించడమే కాకుండా, ఒక్కొక్కరు ప్రత్యేకంగా తమ విజ్ఞప్తిని తెలియజేశారు.

see also:హ్యాట్సాఫ్ ఎంపీ బాల్క సుమన్..!!

విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు మాట్లాడుతూ ,ఇన్నేళ్ల స్వతంత్ర భారతావనిలో రైతుల అండగా నిలిచిన ఒకే ఒక్క ప్రభుత్వం టి ఆర్ ఎస్ ప్రభుత్వమని, దేశవ్యాప్త మన్ననలను చూరగొంటున్న రైతుబంధు, కొత్తగా ప్రవేశపెట్టబోయే రైతు భీమా పథకాలు కృషీవలుని, రాజుగాచేసే వినూత్న పథకాలని కొనియాడారు. 24 గంటల విద్యుత్తు, భారీ నీటి పారుదల, సాగు, త్రాగునీరు ప్రాజెక్టులు, వరదలా దూసుకువస్తున్న విదేశీ పెట్టుబడులు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలబెట్టాయన్నారు.

see also:ఈ రోజు నుంచే రైతు బీమా పథకం వివరాలు సేకరణ

గత నాలుగేళ్లలో తెలంగాణ సాధించిన వృద్ధి రేటు, ప్రవేశపెట్టిన పథకాలు అభివృద్ధి చెందిన యూరప్ దేశాలను ప్రతిబింబిస్తున్నాయంటే నమ్మకతప్పని నిజం. అందులో ముఖ్యంగా చెప్పుఉకోవాలిసిన వాటిల్లో – కేవలం గృహ, వ్యాపార అవసరాలకే కాకుండా వయవసాయానికి సైతం నిరంతర విద్యుత్తు.గడప గడపకు స్వచ్ఛమైన తాగునీరు అందించతలపెట్టిన మిషన్ భగీరథ, దేశానికే గర్వకారణం. వృద్దులకు, వికలాంగులకు మొక్కుబడిగా కాకుండా తమ అవసరాలకు సరిపడు పెన్షన్ విధానం కేవలం మొదటి ప్రపంచదేశాల్లోనే చూస్తున్నాం, కానీ ఇప్పుడు అది తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది.
అన్ని అపోహలను పటాపంచలం చేస్తూ ఏర్పరుచుకున్న పటిష్టమైన తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశవ్యాప్తంగా అందరి మన్ననలను చూడగొంటుంది.శాస్త్ర, సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటవుతున్న
టీ- హబ్ లు, కొత్తగా వస్తున్న ఐటీ కంపెనీలు, పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం అని చెప్పటానికి నిదర్శనం. సరికొత్త హంగులతో ఏర్పాటైన మెట్రో రైలు వ్యవస్థ, కొత్తగా ప్రవేశపెడుతున్న కాలుష్యరహిత వాహనాలు, అన్ని ప్రభుత్వ శాఖలలో ప్రవేశపెట్టిన ఆన్ లైన్ విధానం తెలంగాణ అభివృద్ధికి తార్కాణాలు అని వివరించారు.

see also:ఈ ఎమ్మెల్యే కేటీఆర్ మ‌న‌సును ఎందుకు గెలుచుకున్నాడంటే..!!

ఆశిష్ శర్మ – ప్రవాస ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ప్రతినిది – రాజస్థాన్.

భారతదేశంలోని అన్నిప్రాంతాల, రాష్ట్రాలపై మంచి అవగాహన కలిగిన నేను, గత నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధిని టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా మిత్రులద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను, ఇదొక స్ఫూర్తిదాయక ప్రయాణం. విభిన్నమైన పథకాలు కెసిఆర్ గారి రాజకీయ పరిజ్ఞానానికి నిదర్శనం. నేటి పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి నాయకత్వం దేశంలో ఖచ్చితంగా అవసరం.

see also:ఆర్టీసీ యూనియన్ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలం..!!

సంజిత్ సింగ్ భాటియా – ప్రవాస ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి – న్యూ ఢిల్లీ.

ఈ చర్చావేదికద్వారా కెసిఆర్ గారి గురించి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి అనేక కొత్త విషయాలు తెలుసుకున్నాను, నిజంగా కెసిఆర్ గారు నాలాంటి ఎందరికో ప్రేరణ. పేద విద్యార్థులకు రూపాయికే కిలో బియ్యం చొప్పున ఒక్కో విద్యార్థికి ఆరు కిలోల బియ్యం అందిస్తున్న కెసిఆర్ గారు ఆదర్శప్రాయుడు, నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అలంటి విద్యార్థులకు చేయూతనిస్తున్న కెసిఆర్ గారు దేశరాజకీయాల్లోకి తప్పక రావాలి.

సత్యజిత్ గుళియా – ప్రవాస హర్యానా జనహిత్ కాంగ్రెస్ ప్రతినిధి – హర్యానా.

see also:మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు..!!

గత నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రం అసాధారణ అభివృద్ధిని సాధించింది, ఇది కేవలం గౌరవ కెసిఆర్ ద్వారానే సాధ్యపడింది. ప్రతి ఇంటికి కేవలం ఒకరూపాయికే నల్లా కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్న కెసిఆర్ గారు ఇలాంటి అమోఘమైన పథకాలను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలి, దేశానికి మీలాంటి నాయకుడు కావాలి.

అజయ్ కుమార్ – ప్రవాస సమాజ్ వాదీ పార్టీ ప్రతినిధి – ఉత్తర్ ప్రదేశ్.

తెలంగాణ అంటేనే అభివృద్ధికి మారు పేరులా మారింది, ప్రపంచం మొత్తం నేడు తెలంగాణ వైపు చూస్తుంది. ప్రతి రాజకీయనాయకుడికి కెసిఆర్ గారు మార్గదర్శి అయ్యారు. ఇటీవలే ఇండియాలోని మా నాయకులను కలిసిన కెసిఆర్ గారికి మా సంపూర్ణ మద్దతు కలదు, మీ అభివృద్ధి ఫలాలను అన్ని రాష్ట్రాల్లో అమలుచేసి దేశాన్ని కూడా అభివృద్ధి పరచండి.

కుషు – ప్రవాస శిరోమణి అకాలీదళ్ ప్రతినిధి – పంజాబ్.

ఈ చర్చావేదికకు నన్ను ఆహ్వానించినందుకు టి ఆర్ ఎస్ సభ్యులకు నా ధన్యవాదాలు.కేవలం కెసిఆర్ గారి విజ్ఞానం, రాజకీయ అనుభవం ద్వారానే తెలంగాణాలో ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది. ఒక్కో ఎకరానికి సంవత్సరానికి ఎనిమిది వేయిల పంట పెట్టుబడి సహాయం నన్ను ఎంతగానో ఆకర్షింది, నిజంగా కెసిఆర్ గారికి రైతులందరూ కృతజ్ఞత తెలపాలి, మీరు దేశంలో వున్న రైతులందరికీ ఇలాంటి చేయూతనివ్వాలి.

అనిల్ కుమార్ – ప్రవాస లోక్ జనశక్తి ప్రతినిది.

ఇంత గొప్ప కార్యక్రమంలో నేను పాలుపంచుకోవడం చాల సంతోషంగా భావిస్తాను, టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా సభ్యులకు ధన్యవాదాలు. తెలంగాణ పాలన జనరంజకంగా సాగుతుంది, షాదీ ముబారక్ పథకం ఎంతో గొప్పది, ఆడ పిల్లలకు అందిస్తున్న ఈ చేయూత ఎంతో గర్వకారణం. మీ పథకాలన్నీ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలి, మీరు దేశాధినేత కావాలి.

సౌమ్య కుమార్ – జనతాదళ్ సెక్యులర్ – కర్ణాటక.

టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమంలో ఇంతమంది ప్రవాస భారతీయులు పాల్గొనటం ఎంతో సంతోషకరమైన విషయం. గౌరవ కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకుపోతుంది. ఆసరా పెన్షన్లు కెసిఆర్ గారి నిబద్ధతకు నిదర్శనం, ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్న కెసిఆర్ గారిని ప్రధానమంత్రిగా చూఫలన్న కోరిక ఈ చర్చకువచ్చిన వాళ్లందరిలో వుంది, దాన్ని నేను బలంగా సమర్థుస్తున్నాను.

ఫారెల్ – ప్రవాస బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి – మహారాష్ట్ర.

ఈ సమావేశంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా సభ్యుల ద్వారా ప్రదర్షింపబడిన వీడియోలు చూసినతరువాత కెసిఆర్ గారిని ఎంతపొగిడినా తక్కువే అవుతుంది, కేవలం నాలుగేళ్లలో జరిగిన ఈ అభివృద్ధి, నాతోపాటు హాజరైన మిగతా సభ్యులను కూడా విస్మయానికి గురిచేసింది. ఈ అభివృద్ధిఫలాలను కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశమంతటా విస్తరింపజేల్సిన బాధ్యత కెసిఆర్ గారిపై ఉంది, అందుకు మనమందరం మద్దతునివ్వాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat