2014సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు నాలుగు ఏళ్ళ పాలనపై ఒక ప్రముఖ జాతీయ మీడియాకి సంబంధించిన ఇంగ్లీష్ పత్రిక సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ పాలనపై ..గత నాలుగు ఏండ్లుగా ప్రజల జీవిన గమనంపై
..అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలపై ఈ సర్వే చేయడం జరిగింది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోసం గుప్పించిన ఆరు వందల ఎన్నికల హామీలను కూడా పరిగణలోకి తీసుకుంది సదరు పత్రిక.
see also:అనంతపురంలో రగిలిన ఫ్యాక్షన్..వేటకొడవళ్లతో దాడి..!
ఈ క్రమంలో నాలుగు ఏళ్ళ పాలన ఎలా ఉంది.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికీ ఓట్లు వేస్తారు అని సర్వే నిర్వహించగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుకు పట్టం కట్టిన వారు ముప్పై శాతం మంది అయితే ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపినవారు ఏకంగా నలబై శాతం మంది ఉండటం గమనార్హం ..ప్రస్తుతం ఉన్న నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలలో ఎవరికీ తిరిగి పట్టం కడతారు అని అడిగితే పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలతో సహా అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో ఎనబై శాతం మందికి డిపాజిట్లు గల్లంతు చేస్తామని ఓటర్లు చెప్పడం విశేషం .
see also:వైసీపీలోకి మొన్న గంగుల,నిన్న శిల్పా బ్రదర్స్..నేడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి…కోట్ల సుజాతమ్మ
గత నాలుగేళ్ళుగా చంద్రబాబు హయంలో చెప్పుకోదగ్గ పథకం కానీ కార్యక్రమం కానీ ఉందా అని అడిగితే అరవై మూడు శాతం మంది లేదని చెప్పారు అంట .బాబు హాయంలో అవినీతి పెరిగిందా తగ్గిందా అంటేఏకంగా అరవై నాలుగు శాతం మంది పెరిగింది అని అనేశారు అంట .ప్రత్యేక హోదా అంశం మీద ఎవరు పోరాడుతున్నారు అని అడిగితే వైసీపీ అధినేత జగన్ కు ఎనబై శాతం మంది జై కొట్టగా ..ప్రత్యేక హోదాను సాధించడంలో బాబు విఫలమయ్యారు అని డెబ్బై ఆరు శాతం మంది చెప్పారు అంట .నాలుగు ఏళ్ళ పాలన ఎలా ఉంది అంటే అరవై శాతం మంది అసలు బాగోలేదని ..ఆయనకు ఉన్న అనుభవం దేనికి పనికి రాలేదని తెలిపారు అంట ..