తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ కనీవినీ ఎరగనిరీతిలో చేపల కాలం కనిపిస్తున్నది. చెరువుల్లో నీళ్ళు నిండుగా ఉండడం, ప్రభుత్వం రెండేళ్ళుగా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయడం, మత్స్యకారుల్లో నూతనోత్తేజంతోకూడిన చైతన్యం … అన్నీ కలిసి రాష్ట్రంలో ఎక్కడ చూసినా చేపలసందడి కనిపిస్తున్నది.
see also:మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు..!!
గ్రామస్థాయి మత్స్యకార సొసైటీలకు బలమైన యువనాయకత్వం ఉంటే ఆ సహకార సంఘాలు విజయపథంలో ఎట్లా ముందుకుపోతాయో చెప్పడానికి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలబాక చేపలచెరువు ఒక తాజా ఉదాహరణ! ఎలబాక మత్స్య సహకార సొసైటీకి అధ్యక్షునిగా పనిచేస్తున్న పోలు లక్ష్మణ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా మత్స్య సహకార సొసైటీ అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నారు.
see also:తెలంగాణ అభివృద్ధిపై 29 రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ఎన్ఆర్ఐ ప్రతినిధులు ప్రశంసలు..
ఎలబాక చేపల చెరువులో రెండు సంవత్సరాల క్రితం సొసైటీ తరఫున రండున్నరలక్షల చేపపిల్లలను పోశారు. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీలో భాగంగా మరో 50వేల చేపపిల్లలను వదిలారు. ఈ చెరువులో మొత్తం మూడులక్షల చేపవిత్తనాలు వేశారు. 10 జూన్ 2018 రోజున ఈ చెరువులో చేపలను పట్టారు. మొత్తం 26టన్నులు ఉత్పత్తి జరిగింది. చెరువుగట్టుమీదనే కిలో ఒకంటికి 65 రూపాయల చొప్పున మొత్తం 16లక్షల రూపాయలకు హోల్ సేల్ వ్యాపారికి అప్పజెప్పారు. ఇవే కాకుండా మరో ఐదు క్వింటాళ్ల బొమ్మెచేపు (కొర్రమట్ట లేక కొర్రమీను), రెండు క్వింటాళ్ల గురిజెలు కూడా పట్టుకున్నారు.
see also:ఇద్దరు ఇద్దరే ..!
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమంతటా చెరువుచెరువుకూ ఇట్లాంటి చేపలకథలే కనిపిస్తున్నాయి.