మరికొన్ని నెలల్లో ఏపీ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలే ఏపీ రాజకీయ పార్టీల భవిష్యత్తును తేల్చనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీతో సహా వామపక్ష పార్టీలు ఎవరికి వారు గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి..? వారి బలాబలాలు ఎంత..? గెలుస్తాడా..? అన్న ప్రశ్నలపై సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలన్నీ మిగతా వారికే నాకు కాదంటున్నారు గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి.
see also:‘‘పవన్ అంటే ప్రాణమిస్తాం… జగన్ అంటే ప్రేమిస్తాం’’..!!
ఇక అసలు విషయానికొస్తే.. వివరాలిలా ఉన్నాయి. బాపట్ల నియోజకవర్గం ఇప్పుడు వైసీపీ కంచుకోటగా మారుతోంది. దీనికి కారణం వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేనిన ఆ ప్రాంత ప్రజలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం ఏ ఇతర పార్టీ స్కెచ్‌లు వేసినా.. అవన్నీ వృథా ప్రయత్నాలేనన్న సంకేతాన్ని బాపట్ల ప్రజలు ఇస్తున్నారు. దీంతో బాపట్లపై కన్నేసిన అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ శ్రేణులు సైతం ఖంగు తింటున్నారు.
see also:నాన్న చదివించాడు.. అన్న ఉద్యోగం ఇవ్వాలి
అయితే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో కోన రఘుపతిపై వైసీపీ టిక్కెట్‌పై 5,813 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఓట్లు మరో 30 శాతం పెరిగాయని, దీనికి కారణం చంద్రబాబు సర్కార్ సామాన్యులపై వ్యవహరిస్తున్న దుర్మార్గపు చర్యలేనని, ఆ చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో వైసీపీ విజయం సాధించిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాకుండా, ఎమ్మెల్యే కోటా కింద కోన రఘుపతికి వచ్చే నిధుల్లో.. ప్రతీ పైసాను నియోజకవర్గ అభివృద్ధికే ఖర్చు పెడుతూ.. కోన రఘుపతి ప్రజాభిమానాన్ని పొందారు. వైసీపీపై ప్రజల్లో గట్టి నమ్మకాన్ని పెంచారు. ఇలా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న వైసీపీపై 2019లో పోటీ చేసేందుకు ఇతర పార్టీలకు చెందిన ఏ ఒక్క అభ్యర్థి ముందుకు రాకపోవడం గమనార్హం.