ఏపీలో ఎక్కడ చూసిన టీడీపీ పెద్ద దెబ్బ తగులుతుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలు ,బీజేపి, కాంగ్రెస్స్ ఇతర పార్టీ నేతల్దరు ప్రతి పక్షం పార్టీ అయిన వైసీపీ భారీగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా గోదావరి జిల్లాలో త్వరలో చంద్రబాబునాయుడుకు ఊహించని షాక్ తగలనుందా బిసి సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రి సైకిల్ దిగేసి ఫ్యాన్ క్రింద సేదతీరాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి త్వరలోనే సదరు మంత్రి వైసీపీలో చేరటం ఖాయమని తెలుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గం ఎంఎల్ఏ మంత్రి పితాని సత్యనారాయణ త్వరలో టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం టీడీపీలో మంత్రి పరిస్ధితి బాగానే ఉన్నప్పటికీ భవిష్యత్తుపై బెంగ మొదలైందట.
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయకపోవటమే. ప్రధానంగా కాపులను బిసిల్లో చేరుస్తానన్న హామీ అమల్లోకి రాలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్న హామీ గాలికిపోయింది. ఇక రైతు రుణమాఫీ సంగతి చెప్పనే అక్కర్లేదు. అలాగే డ్వక్రా సంఘాల రుణాలు కూడా మాఫీ కాలేదు. విచిత్రమేమిటంటే కాపులను బిసిల్లో చేర్చాలన్న చంద్రబాబు హామీ అమలు కాకపోవటంతో కాపులు మండిపోతున్నారు. అదే విధంగా కాపులను బిసిల్లో చేర్చాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని బిసిలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పితాని మద్దతుదారుల్లో అత్యధికులు మంత్రిని టిడిపికి రాజీనామ చేసి వైసిపిలో చేరమని ఒత్తిడి పెడుతున్నారట. ఒకవేళ మంత్రి గానీ వైసీపీలో చేరితో నరసాపురం ఎంపిగా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.జిల్లాలో జగన్ పాదయాత్ర విషయంలో జన స్పందన చూసిన తర్వాత పితానిలో వైసీపీలో చేరటం ఖాయమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.