ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ ఆదివారం ఉదయం పాదయాత్రను నిడదవోలు శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ధారవరం, మర్కొండపాడుకు చేరుకుని జననేత భోజన విరామం తీసుకుంటారు.
పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. అనంతరం చంద్రవరం, మల్లవరం మీదుగా గౌరిపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి రాజన్న బిడ్డ ఇక్కడే బస చేస్తారు. వైఎస్ జగన్ మల్లవరంలో బీసీలతో ఆత్మీయ సమావేశం కానున్నారు. దారిపొడవునా జననేతకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.