రైతన్నలకు అండగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఏడాదికి ఎకరానికి 8 వేల చొప్పున పెతుబడి సాయం అందిస్తున్నది.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకుకొందరు రైతుబంధు పథకం కింద వచ్చిన డబ్బులను తిరిగి ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు రంగారెడ్డి షాబాద్ మండలం సోలిపేటలో బాలసుబ్రహ్మణ్యంకు 5 ఎకరాల 37 గుంటల భూమి ఉంది. రైతుబంధు పథకం కింద వచ్చిన రూ. 23,700ల చెక్కును రెవెన్యూ అధికారులకు అందజేశారు.
మహేశ్వరం మండలం నాగారం రెవెన్యూ పరిధిలో సినీ ప్రొడ్యూసర్ ఎలమంచలి రవిశంకర్ పేరిట రెండెకరాలు, ప్రముఖ నటుడు మహేశ్‌బాబుకు ఎకరం, ఆయన సతీమణి నమ్రతకు ఎకరం భూమి ఉంది. వీరికి ప్రభుత్వం పంట పెట్టుబడి కింద రూ.16 వేలు చెక్కులు అందుకున్నారు. శుక్రవారం(జూన్-8) బంజారాహిల్స్‌లోని తమ నివాసాల్లో మహేశ్వరం వ్యవసాయాధికారి కోటేశ్వర్‌రెడ్డి, వీఆర్వో మహేశ్‌కు చెక్కులు తిరిగి అందజేశారు.