పెద్దిరెడ్డి కుటుంబం, ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు వెళ్లే కుటుంబం. ఆపదలో ఉన్న వ్యక్తి పెదవి నుంచి సాయం కావాలనే మాట వచ్చే లోపే.. సహాయం చేసే కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వక్తే మిథున్‌రెడ్డి. 2014 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా ఎన్నికై. ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వేదికగా వైసీపీ నుంచి ఎంపికైన ఎంపీలతోపాటు అలుపెరగని పోరాటం చేశారు. కేంద్రం ఎంతకీ దిగిరాకపోవడంతో.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేక తాము పదవిలో ఉన్నా వృథానే అని భావించిన వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. ఇటీవల కాలంలో పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్ వారి రాజీనామా లేఖలను ఆమోదించారు కూడాను. అందులో మిథున్ రెడ్డి కూడా ఒక్కరు.
ఇదిలా ఉండగా, మిథున్‌రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సేవలే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. అయితే, జూన్ నెలలో బడులు ప్రారంభమవుతాయన్న విషయం ప్రతీ ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సరస్వతి విద్యామందిర్ స్కూల్‌కు వెళ్లారు. పాఠశాల మరమ్మతులకు గురైన విషయాన్ని గుర్తించిన మిథున్‌రెడ్డి రూ.లక్ష సాయం చేశారు. పాఠశాల మరమ్మతులకు ఆ నిధులను ఉపయోగించాలని మిథున్‌రెడ్డి కోరారు.