ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మయూర్ పాన్ హౌస్ యజమానికి సంబంధించిన పలు సంచలన విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి. కాగా, ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై మయూర్ పాన్ హౌస్ యజమాని ఉపేందర్ వర్మ లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే, పాన్‌లో మత్తు మంది కలిపి ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై లైంగిక దాడి చేశాడు. అయితే, ఆ యువతి ఉపేందర్ వర్మపై ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఉపేందర్ వర్మను అరెస్టు చేశారు.
అయితే, పోలీసుల విచారణలో ఉపేందర్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. తనకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిందని, అలా తమ మధ్య స్నేహ బంధం బలపడిందని, ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను అంటూ ఉపేందర్ వర్మ తెలిపాడు. అంతేకాకుండా, ఆ యువతి, తాను కలిసి పార్క్‌లు, హోటళ్ల వెంట తిరిగామని చెప్పాడు. అయితే, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మీదనే కాకుండా, చాలామందిపైనే లైంగిక దాడికి పాల్పడినట్టు ఉపేంద్ర వర్మ అంగీకరించాడు. అలా, పలువురు యువతలతో దిగిన ఫోటోలను, వీడియోలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.