2019 సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు లావాను తలపించేలా వేడెక్కుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ.. నిత్యం మీడియాల్లో కనిపిస్తున్నారు. అందులో భాగంగా, ఇటీవల కాలంలో అధికార టీడీపీ అవినీతిని కాగ్ నివేదిక ఆధారలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. పోలవరం, పట్టిసీమ ఇలా ఏపీలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని కాగ్ వెల్లడించింది.
మరోపక్క చంద్రబాబు పరిపాలన నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ సంస్థలు ప్రజాభిప్రాయాన్ని సేకరించాయి. ఆ సర్వేల్లో ఏపీ ప్రజలు చంద్రబాబు పాలనపై విముఖత చూపుతున్నట్లు తేలింది. నూటికి 70 శాతం మంది ప్రజలు రాజధాని నిర్మాణం, ఇంటికో ఉద్యోగం విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయం ఏపీకి ఉపయోగపడలేదని ప్రజలు తేల్చి చెప్పారు.
అంతేకాకుండా, 2014 ఎన్నికల్లో 600 హామీల మోసపూరిత వాగ్ధానాలతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలను డబ్బు మూటలు చూపి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో కోట్లు చూపి ఓటును కొనుగోలు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఇలా చంద్రబాబుపై రోజులు గడిచేకొద్దీ కేసులు పెరుగుతున్నాయే తప్ప, తగ్గడం లేదు. ఓటుకు నోటు కేసు విచారణ పూర్తయితే.. చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమంటూ ఇప్పటికే పలు పత్రికలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే మీ ఓటు ఓవరికి వేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి.