ఇవాళ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి నటసార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.‘తన నూరవ చిత్రంలో అమ్మపేరు ధరించి కూస్తంత మాతృరుణం తీర్చుకున్న బసవ రామ తారక పుత్రుడు, ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృరుణాన్ని కూడా తీర్చుకుంటున్న తారక రామ పుత్రుడు, శతాధిక చిత్ర ‘నటసింహం’, నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు..’ అంటూ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసింది.వారాహి చలన చిత్రం, బాలకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.
తన నూరవ చిత్రంలో అమ్మ పేరుని ధరించి కూస్తంత మాతృఋణం తీర్చుకున్న "బసవ రామ తారక పుత్రుడు",
ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృఋణాన్ని కూడా తీర్చుకుంటున్న "తారక రామ పుత్రుడు",
శతాధిక చిత్ర "నటసింహం",
నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.#HappyBirthdayNBK | #NTR | pic.twitter.com/oLbk9FLQWr— Krish Jagarlamudi (@DirKrish) June 9, 2018