ఆరోగ్యానికి సారా ఎంత ప్రమాదకరమో.. ఏపీకి నారావారు కూడా అంతే ప్రమాదకరమని వైపీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజా చరణ్ రెడ్డి అన్నారు. కాగా ,శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 600 అబద్ధపు హామీలు ఇచ్చారని, తీరా అధికారం చేపట్టాక హామీలను తుంలో తొక్కారన్నారు.
see also:ఈ వర్షానికి భయపడతామా..? వైఎస్ జగన్
ఏపీకి ప్రత్యేక హోదా సాధించే బాధ్యత నాది అని చంద్రబాబు, ఇచ్చే బాధ్యత మాది అంటూ బీజేపీ, వారిద్దరూ మాట తప్పితే ప్రశ్నించే బాధ్యత నాది అంటూ జనసేన ఇలా ముగ్గురు కలిసి 2014 ఎన్నికల్లో పోటీ చేశారని, తీరి ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఎవరిదారి వారు చూసుకుని చివరకు ప్రజలను మోసం చేశారన్నారు.