పట్టపగలు నడిరోడ్డుపై ఓ జంట వికృతచేష్టలకు దిగింది. వేలాది మంది సేదతీరే ముంబై మెరైన్ డ్రైవ్ రోడ్డులోని డివైడర్‌పైనే ఆ జంట శృంగారంలో పాల్గొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.ముంబైలో నిత్యం వేలమంది సేదతీరే మెరైన్ డ్రైవ్(క్వీన్స్ నెక్లెస్) రోడ్డుపై ఓ విదేశీయుడు, భారత మహిళ అసభ్యచర్యకు పాల్పడ్డారు. పట్టపగలు, రోడ్డుమీద వాహనాలు రద్దీని, వందలాది జనాన్ని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయారు. కాగా, ఆ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురైన వారిలో చాలా మంది సెల్‌ఫోన్లు తీసి వీడియోలు తీయగా, ఇంకొందరు పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నిమిషాల వ్యవధిలోనే పోలీస్ మొబైల్ వ్యాన్ అక్కడికి చేరుకుంది. ఖాకీలను చూసిన ఆ జంట పారిపోయే ప్రయత్నం చేసింది.
పోలీసులు రోడ్డు దాటి వచ్చే లోపే సదరు విదేశీయుడు పారిపోయాడు. మహిళ మాత్రం పోలీసులకు దొరికిపోయింది. తనది గోవా అని, రోడ్డు మీద ముద్దు మాత్రమే పెట్టుకున్నామని పోలీసులతో ఆమె చెప్పింది. పదే పదే ఒంటిమీది దుస్తులను తీసేస్తూ మతిస్థిమితంలేని దానిలా ప్రవర్తించింది. డ్రగ్ అడిక్ట్ లేదా సైకోగా భావిస్తోన్న ఆమెను మహిళా సురక్ష కేంద్రానికి తరలించారు పోలీసులు. ఆమె వివరాలు, పరారైన విదేశీయుడు ఎవరనేది గుర్తించేందుకు పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. మెరైన్ డ్రైవ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడంతోపాటు, దగ్గర్లోని హోటళ్లలో బసచేసిన విదేశీయుల వివరాలను సేకరిస్తున్నారు.