ఆర్టీసీ యూనియన్ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆర్మీసీ కార్మికులకు 16శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సీఎం కేసీఆర్‌తో చర్చల అనంతరం మంత్రులు మహేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్ రావు, కేటీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు.
see also:ఈ ఎమ్మెల్యే కేటీఆర్ మనసును ఎందుకు గెలుచుకున్నాడంటే..!!
ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..ఐఆర్ పెంపుతో ప్రభుత్వంపై నెలకు రూ. 16 కోట్ల భారం పడనుందన్నారు. జులై నుంచి కార్మికులకు ఐఆర్ చెల్లింపు ఉంటుందని మంత్రి తెలియజేశారు. ఆర్టీసీలో నష్టాల నివారణకు హై లెవల్ కమిటీని ప్రభుత్వం నియమించిందన్నారు.
see also:మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు..!!
నాలుగు రోజులుగా ఏడుగురు మంత్రులం సుదీర్ఘంగా చర్చించామని, మంత్రి హరీశ్‌రావు ద్విపాత్రాభినయం చేసి చర్చను కొలిక్కి తీసుకురాడంలో సహకరించారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సీఎం కార్యాచరణ రూపొందించారని చెప్పారు. ఆర్టీసీలో సంస్కరణలు తీసుకువస్తామని, ప్రస్తుతానికి 16శాతం ఐఆర్ ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. సంస్థను కాపాడేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కేటీఆర్ అన్నారు.
see also:న్యూజీలాండ్ లో వినూత్నంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ..!
జులై నుంచి ఆర్టీసీ కార్మికులకు ఐఆర్ అందిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సకల జనుల సమ్మె కాలం నాటి వేతనాన్ని ఆర్టీసీ కార్మికులకు అందించాలని కేసీఆర్ ఆదేశించారన్నారు. అదేవిధంగా అనారోగ్యం బారిన పడిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం కల్పించే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడంలో సీఎం కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు. సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు కార్మికులు సహకరించాలని మంత్రి హరీష్ కోరారు.