చాలా చాలా హాట్, చెప్పలేనంత హాట్ ఫొటోను పోస్టు చేసింది నటి ఇలియానా. తన ఫొటోగ్రాఫర్ కమ్ బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకుని ప్రస్తుతం ఫిజిలో విహరిస్తోంది ఈ నటీమణి. ఫిజీ బీచ్ అందాల గురించి చెబుతూ, అక్కడ దిగిన ఫొటోలను, తన బాయ్‌ఫ్రెండ్ తీసిన వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. ఫిజీ తీరాల్లో సర్ఫింగ్ వరల్డ్ క్లాస్ అనుభవం అని అంటోంది ఇలియానా. ఇక్కడ సర్ఫింగ్ చేశారంటే.. ఫిజిని ప్రేమించేస్తారని తన ఫాలోయర్లకు చెబుతోంది. రండి.. అద్భుతమైన కెరటాలను ఆస్వాధించండి అంటూ.. ఫాలోయర్లకు ఈ ఫొటోతో పాటు పిలుపునిచ్చింది ఇలియానా.
ఈ టూర్లో ఇలియానా వెంట ఉన్నాడు ఆమె బాయ్‌ఫ్రెండ్. చక్కటి ఫొటో గ్రాఫర్ అయిన అతడు అందమైన తన ప్రియురాలి ఫొటోలను మరింత అందంగా తీయడంలో బిజీగా ఉన్నాడు. అలాంటి వాటిల్లో ఇదొక హాట్ పిక్. కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు చేయక ఇక్కడి వాళ్లకు దూరంగా ఉంది ఇలియానా. ఇలాంటి నేపథ్యంలో ఈ హాట్ ఫొటో ఫ్యాన్స్‌ను ఆనందపెడుతోంది. త్వరలోనే తెలుగు తెరపై మళ్లీ కనిపించనుంది ఇలియానా. రవితేజ సినిమాలో నటించబోతోంది.